News May 12, 2024

ప్రజలంతా సంతోషంగా ఉండాలి: కిషన్ రెడ్డి

image

TG: కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్‌పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సుమారు నెలరోజులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్న కిషన్ రెడ్డి కాసేపు ఆలయంలో ప్రశాంతంగా గడిపారు. కాగా రేపు లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

Similar News

News February 3, 2026

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.

News February 3, 2026

అడుగులోనే అరక విరిగిందట

image

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.

News February 3, 2026

ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయా?

image

ఇంట్లో అంగుళం కన్న పెద్ద విగ్రహాలు ఉండకూడదు. ఉంటే నిత్య పూజలు చేయాలి. ఎందుకంటే పెద్ద విగ్రహాలకు చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. దాన్ని ఇల్లు భరించలేదు. అలాగే దైవారాధనకు సగుణ, నిర్గుణ అనే 2 మార్గాలున్నాయి. అందులో విగ్రహ పూజ సగుణోపాసన. దీనికి కొన్ని నియమాలుంటాయి. దాని ప్రకారం అంగుళం కన్నా పెద్ద విగ్రహం ఇంట్లో ఉంటే కఠిన నియమాలతో నిత్య పూజలు తప్పక చేయాలి. లేనిపక్షంలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.