News May 12, 2024

ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు: ముకేశ్ కుమార్

image

AP: ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ‘సీవిజిల్‌’ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రలోభాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వందశాతం పోలింగ్ అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 17, 2026

భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్: మోదీ

image

కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన టాటా-ఎయిర్‌బస్ H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్‌ను మోదీ, మాక్రాన్ ప్రారంభించారు. 2026ను భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్‌గా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్టార్టప్‌లు, AI, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంచుతామన్నారు. ఫ్రాన్స్‌లో వివేకానంద కల్చరల్ సెంటర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్ అని మోదీ పేర్కొన్నారు.

News February 17, 2026

మార్చి మొదటి వారంలో SSC హాల్ టికెట్లు

image

AP: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్కూల్ లాగిన్, ‘మన మిత్ర’ యాప్ ద్వారా వీటిని పొందవచ్చన్నారు. పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ సరిచూసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లలో పొరపాట్లున్నా ఆందోళన చెందవద్దని సూచించారు. యూడైస్ పోర్టల్‌లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందన్నారు.

News February 17, 2026

ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అంటే?

image

ట్రెండ్ అయ్యే ప్రతి హెయిర్ స్టైల్ అందరికీ సెట్ కాదంటున్నారు నిపుణులు. ఫేస్ షేప్‌ని బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోవాలంటున్నారు. రౌండ్, స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్నవారికి బ్యాంగ్స్ బావుంటాయి. జుట్టు కెరటాల్లా అందంగా కనిపించాలంటే లాంగ్ కర్టెన్ బ్యాంగ్స్ చేయించుకోవాలి. రౌండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ బావుంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా కనిపించడంతో పాటు అన్ని డ్రెస్సుల మీదకీ సెట్ అవుతుంది.