News May 12, 2024
ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు: ముకేశ్ కుమార్ సీఈఓ మీనా

రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు తీసుకొచ్చామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. సీవిజిల్‌లో వచ్చే ఫిర్యాదుల ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేశాం. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వంద శాతం ఓట్లు పోల్ అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.


