News May 12, 2024

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు: మోదీ

image

మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. బరాక్‌పూర్‌లో మాట్లాడుతూ.. ‘ఇక్కడి ప్రజలకు 5 గ్యారంటీలు ఇస్తున్నా. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు. SC, ST, OBC రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు. శ్రీరామ నవమి జరుపుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు. CAA అమలును ఎవరూ అడ్డుకోలేరు’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 2, 2025

సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.

News November 2, 2025

లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

image

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్‌ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.

News November 2, 2025

సాగులో వేప వినియోగం – ఫలితాలు అద్భుతం

image

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.