News May 12, 2024

ఒంగోలు నగరంలో బియ్యం రాజకీయం షురూ

image

ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డబ్బు పంపిణీలో ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. ఓ ప్రధాన పార్టీ మూడు రోజుల నుంచి బియ్యం బస్తాలు పంచుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆదివారం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ నుంచి 5వేల బియ్యం బస్తాలను ఒంగోలు తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకోవడం సంచలనమైంది.

Similar News

News March 27, 2026

మార్కాపురం జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరు (D) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

చీమకుర్తి వద్ద ప్రమాదం.. విద్యార్థి స్పాట్‌డెడ్

image

చీమకుర్తి బైపాస్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వేగంగా వస్తున్న ముగ్గురు స్కూల్ విద్యార్థుల బైక్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వారు చీమకుర్తిలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.

News March 27, 2026

కనిగిరి: ఆరు నెలల గర్భిణిని బలి తీసుకున్న బస్సు

image

మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో అవ్వా, మనవరాలు మృతి చెందిన విషయం తెలిసిందే. కనిగిరి మండలం చల్లగిర్లకు చెందిన తమ్మిశెట్టి రుక్మిణి (22) <<19481682>>ఆరు నెలల గర్భవతి<<>>. బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రంలో పనులకోసం వెళ్లి భర్త తిరుపాలు, అత్త పిచ్చమ్మతో కలిసి బస్సులో స్వగ్రామం బయలుదేరింది. ఈ ప్రమాదంలో అత్త- పిచ్చమ్మ, రుక్మిణి మృతి చెందగా భర్త గాయాలతో బయటపడ్డాడు.