News May 12, 2024

అల్లు అర్జున్ పర్యటన.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం

image

AP: ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైనందుకు నంద్యాల SP రఘువీరారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం DGPని ఆదేశించింది. ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని సూచించింది. SPతోపాటు SDPO రవీంద్రనాథ్ రెడ్డి, CI రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిన్న హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు అనుమతి లేకపోయినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో EC చర్యలకు ఆదేశించింది.

Similar News

News November 13, 2025

రూ.12,000 కోట్ల కుంభకోణం.. JIL MD అరెస్ట్

image

రూ.12,000 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (JIL) ఎండీ మనోజ్ గౌర్‌ను అరెస్టు చేసినట్లు ED అధికారులు తెలిపారు. గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో గౌర్ ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ కేసులో జేపీ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు.

News November 13, 2025

32 కార్లతో సీరియల్ అటాక్స్‌కు కుట్ర?

image

ఢిల్లీ బ్లాస్ట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్‌కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.

News November 13, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

image

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>