News May 12, 2024

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

image

ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసినందుకుగాను మున్సిపల్ కమిషనర్ టి.రాంకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. MCC నిబంధనలను అతిక్రమించినందుకు గాను కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

image

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News March 13, 2026

భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

image

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.

News March 12, 2026

గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

image

ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వెన్యూ, స్టాల్స్ సిద్ధం చేయడం, రోడ్ల ప్యాచ్ వర్క్, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.