News May 12, 2024

కర్నూలు: పోలింగ్ రోజు అభ్యర్థుల వాహనాలకు పరిమితి

image

పోలింగ్ రోజున రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించిన వాహనాలకు పరిమితి విధించినట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, కార్యకర్తల కోసం ఒక్కొక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక వాహనంలో డ్రైవర్‌తో పాటు ఐదుగురు కంటే ఎక్కువ మందిని అనుమతించమన్నారు. జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన అనుమతులను ప్రదర్శించాలన్నారు.

Similar News

News March 31, 2026

కర్నూలు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు

image

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కర్నూలు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

News March 30, 2026

కర్నూల్: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికకు 98 వినతులు

image

కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లావ్యాప్తంగా 98 వినతులు అందాయి. ఉద్యోగాల పేరిట మోసాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.