News May 12, 2024
అక్కినేని కజిన్స్ గ్రూప్ ఫొటో

దివంగత అక్కినేని నాగేశ్వరరావు మూడో తరం కజిన్స్ అంతా రీయూనియన్ అయ్యారు. నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ తదితరులు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యంగ్ జనరేషన్ గ్రూప్ ఫొటో బాగుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చైతూ ‘తండేల్’, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Similar News
News March 28, 2026
IPL: మౌనం పాటించిన RCB, SRH ప్లేయర్లు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట మృతులకు RCB, SRH ప్లేయర్లు నివాళులు అర్పించారు. <<19501634>>మ్యాచ్<<>> ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందే బౌండరీ లైన్ వద్ద 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ టైమ్‌లో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. మృతులకు జ్ఞాపకార్థంగా స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా వదిలేసిన విషయం తెలిసిందే.
News March 28, 2026
హైడ్రేటెడ్‌గా ఉండాలంటే వాటర్ తాగితే చాలా?

హైడ్రేటెడ్‌గా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదని వైద్యులు చెబుతున్నారు. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లూ అవసరమని, ఇందుకోసం పొటాషియం, మెగ్నీషియం, సహజ లవణాలు ఉండే ఆహారాలు (అరటి, నారింజ, పాలకూర etc) తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఉపయోగం ఉండదని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అయిందనడానికి దాహం చివరి సంకేతమని, అందుకే దప్పిక లేకపోయినా నీళ్లు తాగాలంటున్నారు.
News March 28, 2026
ఈ ఆలయంలో విగ్రహమే ఉండదు!

తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయం ఆధ్యాత్మికతకు, విజ్ఞానానికి నిలయం. పంచభూత లింగాలలో ఇది ‘ఆకాశ లింగానికి’ ప్రతీక. గర్భాలయంలోని తెరను తొలగిస్తే విగ్రహానికి బదులు శూన్యం (ఆకాశం) కనిపిస్తుంది. అంటే దేవుడికి ఎలాంటి ఆకారం ఉండదని అర్థం. మానవ శరీర నిర్మాణాన్ని పోలి ఉండే ఈ ఆలయ రూపకల్పన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(32/100)


