News May 12, 2024

గిల్ కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు: రవిశాస్త్రి

image

భారత T20WC జట్టులో యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి నిరాశ వ్యక్తం చేశారు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ గిల్. కానీ ఆ టాలెంటెడ్ క్రికెటర్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ ఎదురుదెబ్బను జీర్ణించుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు. దీన్ని పాజిటివ్‌గా తీసుకుని మరింత మెరుగుపడేందుకు గిల్ ప్రయత్నించాలి’ అని సూచించారు.

Similar News

News November 7, 2025

‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

image

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.

News November 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 7, 2025

సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

image

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.