News May 12, 2024
మోదీ నామినేషన్‌కు 12 రాష్ట్రాల సీఎంలు!

ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు 12 మంది, 20 మంది కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. నామినేషన్‌కు ముందు భారీ రోడ్ షో నిర్వహించనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
Similar News
News January 13, 2026
KMR: నేడు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల తుది ఓటర్ల జాబితా విడుదలైంది. దీని కొనసాగింపుగా నేడు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 16న ఫోటోలతో కూడిన పూర్తిస్థాయి జాబితాను ప్రకటిస్తారు. తొలి జాబితాకు స్వల్ప మార్పులు జరగగా, ప్రస్తుతం అందరి దృష్టి ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనపైనే నెలకొంది.
News January 13, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.


