News May 12, 2024
ఓటర్లకు ఆహ్వానం పంపిన కడప కలెక్టర్

ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మే 13న జరిగే ఎన్నికల ఓటింగ్ కార్యక్రమంలో మీ కుటుంబంలోని ఓటర్లందరూ.. తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన ద్వారా ఆహ్వానం పలికారు. ఓటు హక్కును పొందిన వారంతా తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డు కలిగిన పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఓటు వేసేందుకు తరలిరావాలని ఓటర్లను సూచించారు.
Similar News
News March 13, 2026
కడప: ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు 276 మంది డుమ్మా

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 13, 2026
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO శంషుద్దీన్

కడప జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. 9 సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
News March 13, 2026
రేపు కడప జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

కడప జిల్లా వ్యాప్తంగా రేపు (మార్చి 14) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుందనీ, జిల్లాలో మొత్తం 23 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు.


