News May 12, 2024

టాస్ గెలిచిన DC.. RCB బ్యాటింగ్

image

బెంగళూరు వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, రజత్ పాటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్
DC: మెక్‌గుర్క్, పోరెల్, హోప్, కుషాగ్రా, స్టబ్స్, అక్షర్, కుల్దీప్, రసిఖ్ దార్, ముకేశ్ కుమార్, ఇషాంత్, ఖలీల్

Similar News

News March 20, 2026

మసీదులు, ఈద్గాలు వద్ద బందోబస్తు: ఎస్పీ

image

రంజాన్ పండుగ సందర్భంగా బాపట్ల జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా కుల, మత, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

News March 20, 2026

CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

image

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.

News March 20, 2026

మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

image

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.