News May 12, 2024
మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు..!
HYD పరిధి హయత్నగర్లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.
Similar News
News January 21, 2025
NZB: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ: కలెక్టర్
సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 21, 2025
NZB: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. జండాగల్లికి చెందిన నర్సయ్య (43) భార్య, అత్తామామ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం రైలు కిందపడి పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు సమాచారం అందించడంతో స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
News January 21, 2025
గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: NZB కలెక్టర్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.