News May 12, 2024
తిరుపతిలో రాజకీయం వర్సెస్ జర్నలిజం

ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో తిరుపతి రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుపతికి చెందిన ఓ పత్రిక విలేకరులపై చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారి తీశాయి. రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను అన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. మరో వైపు తిరుపతి జర్నలిస్టులు ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 22, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News March 22, 2026
పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.
News March 22, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


