News May 12, 2024
ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థానీ నినాదాలు
ఎన్నికల వేళ ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థానీ నినాదాలు కనిపించడం కలకలం రేపింది. కరోల్‌భాగ్, ఝండేవాలన్ ప్రాంతాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. వెంటనే వాటిని చెరిపేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలోనూ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి నినాదాలను దుండగులు రాశారు.
Similar News
News December 28, 2024
ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడిపై ఎఫెక్ట్!
ఏపీలో కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై ప్రభావం చూపుతోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఒక్క డిసెంబర్‌లోనే రూ.40 కోట్ల రాబడి తగ్గినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, సూర్యాపేట, KMM, కొత్తగూడెం, NLG, గద్వాల్ సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
News December 28, 2024
క్రిప్టో డీలా: రూ.1.2L నష్టపోయిన బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కాస్త డీలా పడ్డాయి. మార్కెట్ విలువ 1.43% తగ్గి $3.29Tగా ఉంది. బిట్‌కాయిన్ $1492 (Rs1.2L) నష్టపోయింది. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి $94,472 వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.23% నష్టంతో $3335 వద్ద కొనసాగుతోంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56,8%, 12.2%గా ఉన్నాయి. BNB, TRX 2% పెరగ్గా XRP 1.35, SOL 2.31, DOGE 0.55, AVAX 2.78% మేర తగ్గాయి.
News December 28, 2024
అంత సీన్ లేదు ‘పుష్పా’..!
AP: ‘పుష్ప-2’లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కనిపించట్లేదట. టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించగా, చాలా మంది రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. చైనా, జపాన్, సింగపూర్, అరబ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గి ఎర్రచందనానికి డిమాండ్ పడిపోయిందని అంచనా.