News May 12, 2024
HYD: ఓటర్ స్లిప్ ఎక్కడ.. అసంతృప్తిలో ఓటర్లు..!

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు అందలేదు. ముఖ్యంగా ఉప్పల్, చార్మినార్, ఖైరతాబాద్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఓటర్లు తమకు ఓటర్ స్లిప్పులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో, ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అందిస్తామని చెప్పిన అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 14, 2026
RR: టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న 53,058 మంది

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 255 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను బాగా రాయాలని ఉపాధ్యాయులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News March 13, 2026
RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
News March 13, 2026
RR: సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, రంగారెడ్డి జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు.


