News May 12, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

image

కురబలకోట మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.  ముదివేడు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వివరాల మేరకు.. మదనపల్లె మండలం, సిటిఎం గ్రామం, కోనంగివారిపల్లెకు చెందిన ప్రసాద్ (26), కురబలకోట మండలంలోని ముదివేడు గ్రామం, చామంచివారిపల్లెకు చెందిన ధరన్(25), కిరణ్ (25)లు సొంత పని మీద బైకులో అంగళ్లుకు బయలుదేరారు. స్కూటర్ అంగళ్లు ఏసి గోడౌన్ వద్ద బొలెరో తప్పించి పడ్డారు.

Similar News

News March 15, 2026

చిత్తూరు: ‘గ్యాస్ కష్టాలు ఉంటే కాల్ చేయండి’

image

జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) 08572-242734 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

News March 15, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.182 నుంచి రూ.186, మాంసం రూ.264 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 15, 2026

చిత్తూరు: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ మెసేజ్‌లను నమ్మొద్దని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బిల్లు బకాయి ఉందని, కట్ట కుంటే సరఫరాను ఆపివేయనున్నట్లు, మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ కొందరు వినియోగదారులకు సందేశాలు అందుతున్నట్లు తెలిసిందన్నారు. ఎటువంటి వివరాలైన APSPDCL అధికారిక వర్గాల ద్వారా తెలియజేస్తామన్నారు.