News May 12, 2024
TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎంబీఏ (MBA) మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 13, 2026
మద్యం విక్రయాల్లో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

మద్యం విక్రయాలు, ఎక్సైజ్ పన్నుల వసూళ్లలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది. రూ.819.08 కోట్ల లక్ష్యానికిగానూ రూ.865.08 కోట్లతో (106శాతం) రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. కొత్త పాలసీ రాకముందు జిల్లాలో 18, 682 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేయగా, పాలసీ తర్వాత (అక్టోబరు- ఫిబ్రవరి మధ్య) అది కేవలం 1827 లీటర్లకు తగ్గిపోయింది.
News March 12, 2026
వీకోట: పేకాట ఆడుతున్న సర్పంచ్ అరెస్ట్

వీకోట (M) రాగిసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI షేక్షావలి తెలిపారు. రామకుప్పం (M) కెంపసముద్రం గ్రామానికి చెందిన గంగాధర్, షేక్ మొహమ్మద్ అలీ, సురేష్, సత్యనారాయణ, రమేష్, PMK తాండకు చెందిన సింగిల్ నాయక్, జంగారెడ్డి, రామకుప్పం సర్పంచ్ మురళితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద రూ.32,550 సీజ్ చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
కుప్పం: తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

కుప్పం పట్టణం గాండ్ల వీధిలో శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో జనం పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి బిడ్డలు మంగమ్మ, ప్రవీణ్, ప్రశాంత్ గాయపడి కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు మరి కొంతమందిపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలిసింది.


