News May 12, 2024
BREAKING: ఎల్లుండి వరకు వైన్స్ బంద్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు రాత్రికి కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా దాన్ని ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


