News May 13, 2024
HYD: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. HYD ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం పోలింగ్ నమోదవగా మల్కాజిగిరిలో 49.63, సికింద్రాబాద్‌లో 46.50, చేవెళ్లలో 53.25 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
Similar News
News March 12, 2026
HYDలో గ్యాస్ సెగ.. రూ.5 ‘బువ్వే దిక్కు’

నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2100 దాటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. హోటళ్లలో ప్లేట్ మీల్స్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే లక్షలాది మంది విద్యార్థులు, కార్మికులకు రూ.5 భోజనం ప్రాణవాయువులా మారింది. గ్యాస్ కష్టాలను అధిగమించడానికి ఈ కేంద్రాల్లో స్టీమ్ ఆధారిత వంట పద్ధతులను వాడుతున్నారు. గతంలో 150 ఉన్న యూనిట్లు ఇప్పుడు దాదాపు 170కి పెరగడం డిమాండ్‌కు నిదర్శనం.
News March 12, 2026
HYD: ఇది సంక్షోభం కాదు.. ప్రమాదం!

HYDలో పైపుల లీకేజీ సమస్యతో సంక్షోభం కాదు, భూగర్భ జలాలు వేగంగా పడిపోవడమే ప్రమాదం. పాతబస్తీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 2.5మీటర్లకు పడిపోయాయి. భారీ నిర్మాణాలు, కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని చెబుతున్నా, పాత భవనాల్లో వీటి అమలు సున్నా. వేసవిలో ట్యాంకర్ల వ్యాపారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
News March 12, 2026
HYD: ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT


