News May 13, 2024

HYD: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. HYD ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం పోలింగ్ నమోదవగా మల్కాజిగిరిలో 49.63, సికింద్రాబాద్‌లో 46.50, చేవెళ్లలో 53.25 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

Similar News

News January 23, 2025

డిజిటల్ భద్రత కోసం రాచకొండ పోలీసుల సూచనలు

image

డిజిటల్ గుర్తింపును రక్షించుకోవడం అత్యంత ప్రాముఖ్యమని రాచకొండ పోలీసులు సూచించారు. బయోమెట్రిక్ OR 2FA వంటి 2తరగతుల భద్రతను ఉపయోగించి అకౌంట్లను రక్షించుకోవాలన్నారు. ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు సృష్టించాలని తెలిపారు. మీ డిజిటల్ హెల్త్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. గూగుల్‌లో మీ వివరాలను చెక్ చేసి, ఉపయోగించని అకౌంట్లను తొలగించాలని(OR)1930లో సంప్రదించాలన్నారు.

News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT

News January 23, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌‌ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT