News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.