News May 13, 2024

రాహుల్‌ గాంధీకి అమిత్ షా 5 ప్రశ్నలు

image

యూపీలోని రాయబరేలీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా 5 ప్రశ్నల్ని సంధించారు. ‘కేంద్రం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ సరైనదా కాదా? ట్రిపుల్ తలాక్ రద్దు కరెక్టా కాదా? దేశంలో ఉమ్మడి పౌరస్మృ‌తి ఉండాలా వద్దా? ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నారా లేదా? ఇప్పటి వరకు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు? ఈ ఐదు ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News March 11, 2026

OTTలోకి 4 కొత్త సినిమాలు

image

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.

News March 11, 2026

భారత్‌కు తొలి టెస్ట్ విజయం అందించింది ఈయనే

image

భారత్‌కు తొలి టెస్ట్ విజయాన్ని(1952లో ENGపై) అందించిన కెప్టెన్ విజయ్ హజారే జన్మదినం నేడు. 1915లో సాంగ్లీ(MH)లో జన్మించారు. IND తరఫున 30 టెస్టుల్లో 2192 రన్స్, 20W తీశారు. 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు. FCలో 238 మ్యాచుల్లో 18,740R, 595W సాధించారు. FCలో 2 ట్రిపుల్ సెంచరీలు, ఒకే టెస్టులో 2 సెంచరీలు చేసిన తొలి IND ప్లేయర్ ఆయనే. కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పేరిట టోర్నీ నిర్వహిస్తోంది.

News March 11, 2026

విద్యార్థినులకు ఫ్రీగా స్కూటీలు.. దశల వారీగా అమలు?

image

TG: ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇస్తామని CM రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. స్కూటీల ధరలతో పాటు పంపిణీకి ఎంత సమయం పట్టొచ్చనే అంశాలను పరిశీలిస్తోంది. దాదాపు 1.70లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని, స్కూటీల కొనుగోలుకు ₹1600Cr ఖర్చవుతుందని అంచనా. రానున్న వార్షిక బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిస్తారని సమాచారం.