News May 13, 2024

సిరా చుక్క తయారయ్యేది మన HYDలోనే..!  

image

ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వేలికి పెట్టుకునే సిరాని 1990 నుంచి HYDలోనూ తయారు చేయటం ప్రారంభించారు. ఉప్పల్‎లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. సుమారు 100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది. దాదాపు 100 దేశాలకు ఈ సిరాను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Similar News

News October 8, 2024

ఎన్కౌంటర్లకు నిరసనగా వచ్చే నెల భారీ ధర్నా: ప్రొఫెసర్

image

చత్తీస్‌గడ్‌లో ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లో వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. మధ్య భారత దేశంలో గత 10 నెలలుగా కొనసాగుతున్న ఆదివాసి హత్యాకాండ మరింత తీవ్రమైందన్నారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నవంబర్ 3న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News October 8, 2024

HYD: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన ఎమ్మెల్యేలు

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహానికి రావాల్సిందిగా వెంకయ్య నాయుడుకి ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా హాజరవుతామని వెంకయ్య నాయుడు తెలిపారు.

News October 8, 2024

HYD: మెట్రో జోన్లో రూ.83 కోట్లతో విద్యుత్ పనులు

image

HYD మెట్రో జోన్ పరిధిలో రూ.83 కోట్లతో 939 DTRలు, ఫీడర్ల మార్పులు UG, AB కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ల పెంపు సైతం జరగనుంది. వచ్చే వేసవి కాలంలో కరెంటు డిమాండ్ దృష్టిలో ఉంచుకొని, TGSPDCL అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.