News May 13, 2024

అది కచ్చితంగా ఔటే: సంగక్కర

image

నిన్న CSKvsRR మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఫీల్డర్ త్రో‌కు అడ్డు రావడంతో అంపైర్ ఔట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. SRHతో మ్యాచ్‌లోనూ జడ్డూ ఇదే తరహాలో అడ్డు రాగా ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నారు. కానీ ఈసారి తాము చేసింది కరెక్టేనని RR కోచ్ సంగక్కర స్పష్టం చేశారు. జడ్డూ వెనక్కి సరాసరి పరిగెత్తకుండా బంతికి అడ్డువచ్చేందుకు యత్నించారని, అందువల్ల అతడి ఔట్ సరైనదేనని తేల్చిచెప్పారు.

Similar News

News February 12, 2026

నేనే రాజు.. నేనే మంత్రి: రేవంత్ రెడ్డి

image

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో TG సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ కాదు. పదిన్నరేళ్లు సీఎంగా ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు తాను చేయనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్యానించారు.

News February 12, 2026

‘ఖేలో ఇండియా’ నుంచి 1,342 మంది అథ్లెట్ల తొలగింపు

image

ఖేలో ఇండియా ప్రోగ్రామ్ నుంచి గత 3ఏళ్లలో 1,342 మంది అథ్లెట్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. లో పర్ఫార్మెన్స్, డోపింగ్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని చెప్పారు. 3ఏళ్లలో 2,905 మంది కొత్తగా చేరారని తెలిపారు. స్పోర్టింగ్ టాలెంట్‌ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతం 23K+ మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.

News February 12, 2026

ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

image

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్‌ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్‌లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.