News May 13, 2024

విశాఖలో నగదు పట్టుకున్న పోలీసులు

image

ఎన్నికల నేపథ్యంలో విశాఖలోని పలుచోట్ల నగదు పట్టుబడుతుంది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మధారలో రూ.1.14 లక్షలు, ఎంవీపీ కాలనీలో రూ.1 లక్ష, మరోచోట రూ.2 లక్షలు, రూ.29 వేలు, రూ.30వేలు చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ నగదును ఆయా ఎంసీసీ, ఎఫ్ఎస్‌‌టీ బృందాలకు అప్పగించామన్నారు.

Similar News

News March 11, 2026

విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

image

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

News March 11, 2026

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజుల ముందే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం వృద్ధి. ఈ చారిత్రాత్మక విజయం అని.. టీమ్ వాల్తేరును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. కస్టమర్ కేంద్రీకృత విధానాలు, సమన్వయంతోనే ఈ అసాధారణ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

మధురవాడ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ఏసీబీ అధికారుల ఆరా

image

మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.