News May 13, 2024

నెల్లూరు జిల్లాలో మాక్ పోలింగ్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 6 గంటలకు సంబంధిత ఓట్ల ఫలితాలను పరిశీలించి.. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయో లేదో నిర్ధారించారు. అన్నీ ఓకే అనుకుంటే సంబంధిత మాక్ పోలింగ్ ఓట్లను తొలగించి 7 గంటల నుంచి అసలైన ఓటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో జిల్లాలో 20.61 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు.

Similar News

News March 11, 2026

నెల్లూరులో 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా

image

నెల్లూరు జిల్లాలో పంచాయతీలకు గ్రేడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాటిలో జనాభా ప్రాతిపదికన 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా లభించింది. అల్లూరు, బోగోలు, కోట, కోవూరులో 2 పంచాయతీలు, ముత్తుకూరులో 2 పంచాయతీలు, పొదలకూరు, రాపూరు, సంగం, ఉదయగిరి, వింజమూరు, కలువాయి పంచాయతీలు ఉన్నాయి. ఇక మీదట ఈ పంచాయతీల్లో మున్సిపాలిటీ తరహాలోనే పాలన కొనసాగనుంది.

News March 11, 2026

నెల్లూరు: వెటర్నరీ క్యాంపులు ఎప్పుడో..!

image

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల కిందట వెటర్నరీ క్యాంపులు ఆగిపోయాయి. జిల్లాలో 8 మార్కెటింగ్ కమిటీల పరిధిలో రెండేసి చొప్పున 16 క్యాంపులు చేపట్టాలి. ఒక్కో క్యాంపునకు రూ.25 వేలు చొప్పున మార్కెటింగ్ శాఖ ఖర్చు చేస్తున్నా.. వెటర్నరీ అధికారులు తేదీలు ఖరారు చేయడం లేదు. ఇవి జరిగితే పశువులు, మేకలు, గొర్రెలకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. నెలాఖరు లోపు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లనున్నాయి.

News March 11, 2026

అమ్మాయిలూ.. ఈ నంబర్లు మీ వద్ద ఉన్నాయా.?

image

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై నెల్లూరు జిల్లాలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆపద సమయంలో తక్షణ పోలీస్ సహాయం పొందేందుకు ప్రతి మహిళా, విద్యార్థిని తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని కోరారు.