News May 13, 2024
మోదీతో చర్చకు రాహుల్‌కేం అర్హత ఉంది?: స్మృతి

ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమంటున్న రాహుల్ గాంధీకి అసలు ఏం అర్హత ఉందంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘ఆయనేమైనా ప్రధాని అభ్యర్థా..? ఒకే వేదికపై ప్రధానితో చర్చించాలంటే ఆ స్థాయి వ్యక్తి అయి ఉండాలి. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి అమేథీలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై పోటీ చేసే ధైర్యం లేని రాహుల్, ప్రధాని మోదీతో చర్చకు సిద్ధపడతారా?’ అని స్మృతి నిలదీశారు.
Similar News
News February 16, 2026
పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.
News February 16, 2026
మేలో శ్రీవారి సేవలు, దర్శనాల కోటా షెడ్యూల్

AP: ఈ ఏడాది మే నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు, దర్శనాలు, వసతి టికెట్ల కోటా విడుదల షెడ్యూల్‌ను TTD ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆర్జిత సేవల టికెట్లకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. 21న కళ్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణ టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఉచిత ప్రవేశ దర్శన కోటా, 24న రూ.300 టికెట్లు, గదుల బుకింగ్, 27న శ్రీవారి సేవ కోటాను రిలీజ్ చేస్తారు.
#ShareIt
News February 16, 2026
మండపారాధన అంటే మీకు తెలుసా?

వ్రతం/పూజ చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే ప్రక్రియే మండపారాధన. ఇందులో ప్రధాన దైవంతో పాటు పంచపాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులను కూడా పిలుస్తారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. పూజలో పెట్టే వక్క దేవతాంశకు, పసుపుకొమ్ము స్త్రీ రూప దేవతా శక్తికి, ఖర్జూరం నైవేద్యంగా, అక్షింతలు దేవతా అర్చన కోసం, నాణెం హిరణ్య రూప దక్షిణగా సమర్పిస్తారు. వీటితో గ్రహ దోషాలు పోతాయని నమ్మకం.


