News May 13, 2024

దొంగ ఓటు వేయడానికి వెళ్తే కేసే!

image

ఎవరైనా ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చారని పోలింగ్ ఏజెంట్లకు అనుమానం కలిగితే వారు ఆ వ్యక్తి గుర్తింపును సవాల్ చేస్తారు. ఇందుకోసం ప్రిసైడింగ్ అధికారికి రూ.2 డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం ఆ అధికారి విచారణ చేపడతారు. దొంగ ఓటు వేయడానికి వచ్చారని తేలితే సదరు వ్యక్తిని అక్కడున్న పోలీసులకు అప్పగించి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.

Similar News

News February 21, 2026

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News February 21, 2026

667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>మహానది <<>>కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 667 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా(మైనింగ్, పాథాలజీ), డిగ్రీ(మైనింగ్ Engg., మైనింగ్ సర్వేయింగ్ Engg.), ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, BA అర్హత గలవారు మార్చి 16 -ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: mahanadicoal.in

News February 21, 2026

ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

image

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్‌లు, 75K కాటన్ బ్లౌజ్‌లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.