News May 13, 2024

17 సార్లు ఓటేసి ఆదర్శంగా నిలిచిన 105 ఏళ్ల వృద్ధురాలు

image

దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన ఇందిరాదేవి 17వ సారి ఓటేసింది. 105 ఏళ్ల వయసున్న ఈమె ఈసారి హోం ఓటింగ్‌లో పాల్గొన్నారు. చాలా సార్లు క్యూలో నిల్చొని ఓటేశానని, ఓటు హక్కుతో మంచినేతను ఎన్నుకోవచ్చని ఆమె వివరించింది. ఓటు వేసే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరింది. నేడు ఓటు వేసే అందరికీ ఈమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.

News September 29, 2024

పల్నాడు: రైలులో భారీ చోరీ

image

హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.

News September 29, 2024

హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి

image

‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.