News May 13, 2024

భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులు ఓటేసేది ఇక్కడే

image

రఘువీర్ రెడ్డి (INC) నందికొండలోని విజయపూరి నార్త్, హిల్ కాలనీలో, BRS MP అభ్యర్థి కృష్ణారెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటేయనున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి (INC) శాలిగౌరారం మం. బాలిశెట్టి గూడెం, క్యామ మల్లేశ్ (BRS) ఇబ్రహీం పట్నం పరిధి శేరిగూడెం, బూర నర్సయ్య (BJP) ఇబ్రహీం పట్నం పరిధి పసుమాముల, జహంగీర్ (CPM) మునిపంపులలో ఓటుంది.

Similar News

News March 15, 2026

NLG: పల్లెల్లో ఇక ‘సౌర’ వెలుగులు..

image

సామాన్యుడి ఇంటిపై ఇక సౌర ఫలకలు మెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ’ పథకం ద్వారా గ్రామాల్లో ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిదశలో భాగంగా నల్గొండ జిల్లాలోని కనగల్, అనుముల, ముదిగొండ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

News March 15, 2026

నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

image

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 15, 2026

జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

image

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.