News May 13, 2024
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డిలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రణీత్, రిషికేష్, శివాజీ బైక్‌పై తమ పొలం వైపు వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ వచ్చి ఢీకొంది. దీంతో ప్రణీత్ (12) అక్కడికక్కడే మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
NZB: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల అందజేత

నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్లను, హోర్డింగులను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వాటిని ఇచ్చారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమన్నారు.
News April 1, 2026
NZB: కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?: కవిత

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.