News May 13, 2024

అనంత: ఎన్నికలకు బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లోని ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను వినియోగించారు. దీంతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరవకొండ నుంచి అనంతపురం, బళ్లారి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Similar News

News March 27, 2026

అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

image

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.

News March 26, 2026

గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

image

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.