News May 13, 2024
ADB: పోలింగ్ ప్రారంభం.. ఇవి తప్పనిసరి..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, లేబర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, దివ్యాంగుల కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకటి తప్పనిసరి.
Similar News
News March 20, 2026
ADB: ఖచ్చితత్వంతో జనగణన జరగాలి: కలెక్టర్

జనగణన ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం టీటీడీసీ భవనంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గణనలో సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్ పాల్గొన్నారు.
News March 20, 2026
ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లు నమ్మవద్దు!

ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలలో తగినంత నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై, సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.