News May 13, 2024
ఓటు వేసేందుకు వెళ్తున్నారా? మీ కోసమే..

* పోలింగ్ బూత్‌లో వీడియో/ఫొటోలు తీయకూడదు.
* పోలింగ్ రోజున మీరు ఎవరికి ఓటు వేశారో సోషల్ మీడియాలో వెల్లడించకూడదు.
* పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇతరులకు సహకరించండి.
* ఓటర్ కార్డు లేదా ఈసీ సూచించిన 12 డాక్యుమెంట్లలో ఒకటైనా వెంట తీసుకెళ్లండి.
* క్యూ పద్ధతి పాటిస్తూ, మీ సమయం కోసం వేచి ఉండండి.
* పోలింగ్ సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించండి.
Similar News
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.


