News May 13, 2024
మొబైల్ ఫోన్లు తేవొద్దు: CEO

AP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) ముకేశ్ కుమార్ మీనా విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని, ఎవరూ తీసుకురావొద్దని కోరారు. పలుచోట్ల ఘర్షణలు తలెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News March 20, 2026
SKLM- HYDకి డైరెక్ట్ ట్రైన్స్ ఏర్పాటే నా లక్ష్యం: రామ్మోహన్

AP: శ్రీకాకుళం నుంచి నేరుగా HYD, తిరుపతికి రైలు సర్వీసుల ఏర్పాటే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం(D) హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైన 3 రైళ్లను ఆయన ప్రారంభించారు. 45 రోజుల్లోనే 6 రైల్వే స్టాప్‌లకు అనుమతి రావడం గర్వకారణమన్నారు. రవాణా వ్యవస్థను మరింత బలపరిచి, ఉపాధి అవకాశాలనూ పెంచే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
News March 20, 2026
పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో సాధారణ వాహన ఇంధన ధరలను పెంచబోమని IOCL ప్రకటించింది. ప్రీమియం పెట్రోల్ XP-95(పవర్ పెట్రోల్) రేట్లను మాత్రమే పెంచామని, ఈ ప్రభావం స్వల్ప స్థాయిలోనే ఉంటుందని తెలిపింది. సరసమైన ధరల్లో స్థిరమైన సరఫరాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా <<19432956>>పవర్ పెట్రోల్<<>> లీటర్‌పై రూ.2.35 వరకు, ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్‌పై రూ.22 పెంచిన విషయం <<19434174>>తెలిసిందే.<<>>
News March 20, 2026
ధురంధర్-2 చెత్త సినిమా.. నటి విమర్శలు

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడే ధురంధర్-2 సినిమా చూశా. ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇదో చెత్త సినిమా. బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు ఉంది. ఈ మూవీ చూసి సమయం, డబ్బులు వృథా చేసుకోకండి. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, BGM, నటన.. ఏవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి’ అని ట్వీట్ చేశారు.


