News May 13, 2024
రాజవొమ్మంగిలో మోరాయించిన ఈవీఎంలు

ఏజెన్సీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజవొమ్మంగి మండలంలోని 75, 76 పోలింగ్ కేంద్రాలలో ఇప్పటివరకు ఈవీఎంలు మోరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం ఈవీఎంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పోలింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.
Similar News
News January 9, 2026
రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్‌ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్‌లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.
News January 8, 2026
బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


