News May 13, 2024

BREAKING.. ఖమ్మం జిల్లాలో పోలింగ్ బహిష్కరణ

image

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.

News March 14, 2026

ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 14, 2026

ఖమ్మంలో ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దరఖాస్తులు

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిబిఏ, బీసీఏ, బీఏతో పాటు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్‌కు అర్హులని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.