News May 13, 2024
మొరాయిస్తున్న ఈవీఎంలు.. మీ ఊరిలో ఓటింగ్ ఎలా జరుగుతోంది?

ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాలలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కర్నూలులోని 78, మహానందిలోని 195, హాలహర్విలోని 74, బాపురంలోని 22, బంధార్ల పల్లెలోని 28వ, తదితర పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేరయడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మీ ఊరిలో ఓటింగ్ సరళి ఎలాఉందో తెలపండి.
Similar News
News March 29, 2026
వచ్చే నెల 7 లోగా విద్యార్థులు పాఠశాలలో చేరండి: లోక రాజు

2026-27 విద్యా సంవత్సరానికి విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్-12(1)సీ ప్రకారం ఒకటో తరగతి అడ్మిషన్లకు మొదటి విడత లాటరీ ద్వారా 2,734 మంది ఎంపికయ్యారని కర్నూలు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ లోక రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు ఆయా పాఠశాలలో ఉచిత అడ్మిషన్లు పొందాలన్నారు. తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే 90001 04836ను సంప్రదించవచ్చు అన్నారు.
News March 29, 2026
యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి: కలెక్టర్

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంచే విధంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఏ.సిరి స్పెషల్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత గ్రేడ్ ‘ఏ’ స్థాయిని అధిగమించి 2026-27లో ‘ఏ+’ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా మల్లె, టమాటా, ఉల్లిపాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.