News May 13, 2024

ఇదో అపురూపమైన అనుభూతి: షర్మిల

image

AP: రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికల పండగ వేళ, తన తండ్రి వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహించిన కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అపురూపమైన అనుభూతి అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ తల్లిదండ్రుల ఆశీస్సులు, దేవుడి దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

గుడ్‌న్యూస్.. 60% సీట్లపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్

image

విమాన సీట్ల సెలక్షన్ ఛార్జీల పేరుతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు చేస్తున్న అదనపు వసూళ్లకు కేంద్రం చెక్ పెట్టింది. కనీసం 60% సీట్లను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా కేటాయించాలని DGCA ఆదేశించింది. ఒకే PNRపై ప్రయాణించే కుటుంబ సభ్యులను పక్కపక్క సీట్లలోనే కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. విమానాల రద్దు, ఆలస్యం వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను లోకల్ లాంగ్వేజెస్‌లో డిస్‌ప్లే చేయాలని పేర్కొంది.

News March 18, 2026

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.

News March 18, 2026

మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

image

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.