News May 13, 2024

MBNRలో 10.33.. NGKLలో 9.18 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గం. వరకు MBNR పరిధిలో 10.33, నాగర్ కర్నూల్‌లో 9.18 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 8.65, వనపర్తి- 11.46, గద్వాల- 9.23, ఆలంపూర్- 9.42, అచ్చంపేట- 8.13, కల్వకుర్తి- 11.31, కొల్లాపూర్- 10.31⏵మహబూబ్‌నగర్-10.87, జడ్చర్ల-11.32, దేవరకద్ర-12.25, నారాయణపేట-9.40, మక్తల్-8.07, షాద్‌నగర్-9.25, కొడంగల్-11.19 శాతం నమోదైంది.

Similar News

News March 14, 2026

MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

image

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. ​పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.

News March 13, 2026

MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

image

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.