News May 13, 2024
ఓటు వేసిన కలెక్టర్ దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర ఈరోజు ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ సమీపంలోని చెన్నకేశవ స్కూల్లో కలెక్టర్ ఓటు వేశారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలైన్లో నిలబడి కలెక్టర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
Similar News
News March 3, 2026
నల్గొండ: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘ఇన్‌ఛార్జీ’ల రాజ్యం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 15 కార్యాలయాల్లో సగానికి పైగా చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేరు. మునుపెన్నడూ లేని విధంగా సిబ్బంది కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఆర్‌లు సైతం ఎఫ్ఏసీలే కావడం గమనార్హం.
News March 2, 2026
NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.
News March 2, 2026
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఉపాధి హామీపై కలెక్టర్ సీరియస్

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


