News May 13, 2024
టెంట్లు లేవు.. తాగునీళ్లు లేవు

AP: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం మండలం జనుపల్లెలో అధికారులు కనీసం టెంట్లు, తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో మండుటెండలోనే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు.
Similar News
News March 4, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యుద్ధం మొదలైన రోజు అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,850 పతనమై రూ.1,50,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.20వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.
News March 4, 2026
‘మద్యం’లో డిజిటల్ చెల్లింపులను పెంచేలా త్వరలో పాలసీ!

AP: మద్యం విక్రయాల్లో ప్రస్తుతం 30%గా ఉన్న డిజిటల్ చెల్లింపులను 60%కి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి షాపులో డిజిటల్ పేమెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొనుగోలుదారులు డిజిటల్ చెల్లింపులు చేస్తామంటే లైసెన్సీలు తిరస్కరించకూడదు. అలాగే ఏ రోజు ఎంత అమ్మారో తెలుసుకునేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని కూడా ఎక్సైజ్ శాఖ తీసుకురానుంది.
News March 4, 2026
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు కుంగి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.


