News May 13, 2024

ఈనెల 15న సీపీగెట్ నోటిఫికేషన్

image

TG: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) నోటిఫికేషన్ ఈనెల 15న విడుదల కానుంది. రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఏదైనా కోర్సులో 10కంటే తక్కువ మంది చేరితే.. ఆ కోర్సును మూసివేయనున్నారు. గతేడాది విధించిన ఈ నిబంధనను ఈసారి కూడా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 4, 2026

ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

image

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.

News March 4, 2026

ఇరాన్ పోరాటం వెనుక చైనా బలం!

image

US-ఇజ్రాయెల్‌కు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. వాటిని టార్గెట్ చేస్తూనే UAE, ఒమన్, సౌదీ సహా 11 దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ పోరాటానికి రహస్యంగా చైనా సాయపడిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అత్యాధునిక వెపన్స్‌‌తోపాటు కీలక సాంకేతికతను సరఫరా చేసిందని చెబుతున్నాయి. చైనా అండ లేకపోతే ఇరాన్ నిలబడేది కాదంటున్నాయి. శత్రువులపై కచ్చితత్వంతో చేస్తున్న దాడులను ఉదహరిస్తున్నాయి.

News March 4, 2026

అల్లు ఫ్యామిలీని చూశారా?

image

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.