News May 13, 2024

ఎన్డీఏకు 400 సీట్లు రానున్నాయి: మోదీ

image

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను చూస్తే ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత సైన్యంపై కాంగ్రెస్ తన ద్వేషాన్ని ప్రతిసారి చూపిస్తోందన్నారు. రామమందిర నిర్మాణం తర్వాత కాంగ్రెస్ వైఖరి అర్థమైందని.. తిరిగి రాముడిని టెంట్‌లోకి పంపాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేనని విమర్శించారు.

Similar News

News February 9, 2026

UK పీఎంగా తొలిసారి ముస్లిం వ్యక్తి?

image

తొలిసారి ముస్లిం వ్యక్తి UK PM పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత PM స్టార్మర్ సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఫైల్స్ దుమారంలో చిక్కుకోవడంతో అధికార లేబర్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. త్వరలో ఆయన పదవి కోల్పోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హోం సెక్రటరీగా ఉన్న షబానా మహమూద్(45) PM పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. షబానా పేరెంట్స్‌కు పాక్ మూలాలున్నాయి.

News February 9, 2026

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు

image

<>AP:<<>> పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన మహిళలు ఫిబ్రవరి 20వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రొవిజినల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు. వయసు 25నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి. వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/

News February 9, 2026

అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

image

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.