News May 13, 2024

నేడు పోటీలోని ప్రముఖులు వీరే

image

నేటి నాలుగో దశ ఎన్నికలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా పోటీలో ఉన్నారు. అటు BJP నేతలు పురందీశ్వరి, బండి సంజయ్, మాధవీ లత, సాక్షి మహరాజ్‌లతో పాటు APPCC చీఫ్ షర్మిల, AIMIM చీఫ్ అసదుద్దీన్, YCP నేత అవినాశ్ రెడ్డిల భవితవ్యం నిర్ణయించేది ఇవాళే. అంతేకాక INC లీడర్ అధిర్ రంజన్ చౌదరి, SP నేత అఖిలేశ్, TMC లీడర్లు యూసఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా సైతం ఇవాళ ప్రజాస్వామ్య పరీక్షలో ఉన్నారు.

Similar News

News March 4, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 4, 2026

TODAY HEADLINES

image

☛ చంద్రబాబు-పవన్ భేటీ.. జల్ జీవన్ మిషన్, హనుమాన్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ
☛ ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM రేవంత్
☛ చంద్రగ్రహణం.. ఎర్రని రంగులో కనువిందు చేసిన చంద్రుడు
☛ కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
☛ ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA
☛ యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి

News March 4, 2026

పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర: ఖవాజా ఆసిఫ్

image

ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక జియోనిజం(ఇజ్రాయెల్ జాతీయవాదం) ప్లాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. తమ దేశ సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని విస్తరించాలని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇందులో అఫ్గాన్, ఇండియాకు భాగముందన్నారు. తమ అణుశక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశాన్ని కాపాడేందుకు సైన్యం రెడీగా ఉందని చెప్పారు.