News May 13, 2024
MDK:ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి
Similar News
News March 5, 2026
‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 5, 2026
మెదక్: తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

కొల్చారం మండలం సీతారాంపూర్ తండాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మాలావత్ నాని అనే యువకుడు తన తల్లి లక్ష్మిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
మెదక్: చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్

మనోహరాబాద్ :చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు


