News May 13, 2024

MBNRలో 26.99.. NGKLలో 27.74 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 11గం. వరకు MBNR పరిధిలో 26.99, నాగర్ కర్నూల్‌లో 27.74 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 26.12, వనపర్తి- 29.46, గద్వాల- 29.53, ఆలంపూర్- 30.46, అచ్చంపేట- 25.32, కల్వకుర్తి- 28.46, కొల్లాపూర్- 24.50⏵మహబూబ్‌నగర్-25.23, జడ్చర్ల-29.80, దేవరకద్ర-29.75, నారాయణపేట-24.32, మక్తల్-25.11, షాద్‌నగర్-25.69, కొడంగల్-29.32 శాతం నమోదైంది.

Similar News

News September 29, 2024

జోగులాంబదేవికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అక్టోబర్ 9వ తేదీన కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాష జోగులాంబ దేవికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఇఓ పురేందర్ కుమార్ తెలిపారు. చాలాకాలంగా ఏపీ ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని స్పష్టం చేశారు.

News September 29, 2024

MBNR: గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

image

అచ్చంపేట మండలం నడింపల్లిలో గణనాథుడి లడ్డూను ముస్లిం సోదరుడైన ఎండీ. మోదీన్ కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 21 రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను శనివారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో రూ.40,116కు మోదీన్ సొంతం చేసుకున్నాడని తెలిపారు. అతని కుటుంబానికి ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని, వినాయకుడి కృపతో అష్ట ఐశ్వర్యాలు, సుఖఃసంతోషాలు కలగాలని కమిటీ తరఫున కోరుకోవడం జరిగిందన్నారు.

News September 29, 2024

సీఎం ఫోటోలు కాదు.. 6 గ్యారంటీలు అమలు చేయండి: నిరంజన్ రెడ్డి

image

ప్రతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్టోబర్ 7లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం వచ్చి 10నెలలైనా 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఇదే తరహాలో 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.