News May 13, 2024
ఒక్క ఏడాదిలో దేశం గురించి ఏం తెలుస్తుంది?: మోదీ

ఈ ఎన్నికల్లో NDA కూటమి 400 సీట్ల మార్క్ దాటుతుందని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ‘మోదీని వ్యతిరేకిస్తే గెలుస్తామని ఇండియా కూటమి భావిస్తోంది. కానీ ఇప్పటివరకు ఆ కూటమి ప్రధాని అభ్యర్థినే తేల్చుకోలేదు. ఏడాదికి ఒకరిని చొప్పున ప్రధానిని చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఓ పేపర్‌లో చదివా. ఒక్క ఏడాదిలో దేశం గురించి ఆ ప్రధానికి ఏం తెలుస్తుంది? ఏం చేయగలడు?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 12, 2026
సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల డ్యూటీనా: YCP ప్రశ్న

AP: NTR జిల్లా జగ్గయ్యపేటలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా సచివాలయ ఉద్యోగులను టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని డ్యూటీలు వేయడం ఏంటని YCP ప్రశ్నించింది. ‘సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరి చేసే బానిసలు అనుకుంటున్నారా? అక్కడ ఏటా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరమే కొత్తగా జరగడం లేదు. ఆదివారం, సెలవు రోజుల్లో ఉద్యోగులకు పని చెప్పడం దారుణం’ అని ట్వీట్ చేసింది.
News February 12, 2026
హెన్నాతో ఎన్నో లాభాలు

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.
News February 12, 2026
ఈ దశలో మామిడి పూతపై మందుల పిచికారీ వద్దు

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో ఎలాంటి పురుగు మందులను చెట్లపై పిచికారీ చేయవద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో పురుగు మందుల పిచికారీ వల్ల మామిడి పిందెలు కట్టడానికి సాయపడే కీటకాలు, తేనెటీగలు చనిపోతాయి. పూలలోని పుప్పొడి, మందు ద్రావణంలో కొట్టుకుపోతుంది. దీని వల్ల పూలలో సంపర్కం జరగక పిందెలేర్పడవు. అందుకే ఈ సమయంలో నిపుణుల సలహాలను రైతులు తప్పక తీసుకోవాలి.


